మహిళా/పురుష (Un-Married/Widower/Divorcee) ఉద్యోగులకు 180 రోజులుశిశు సంరక్షణ సెలవు (చైల్డ్ కేర్ లీవు)
G.O.Ms.No. 132(HR-IV-FR) Finance Department Dated: 06-07-2016 G.O.Ms.No. 33 (HR-IV-FR&LR) Finance Department Dated: 08-03-2022
10వ పి.ఆర్.సి. ప్రతిపాదనలు అనుగుణంగా సర్వీసు మొత్తములో పిల్లలను పెంచు నిమిత్తము లేక పాఠశాల & కాలేజి స్థాయి. పరీక్షల సమయంలోనూ, వారి ఆనారోగ్య సమయంలలో, వగైరాలకు 2నెలలు (60రోజులు) వరకు శిశు సంరక్షణ సెలవులు క్రింద తెలుపబడిన నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినది. ఈ సదుపాయము మహిళా ఉద్యోగులకు మాత్రమే క్రింది నిబంధనలు అనుసరించి వినియోగించుటకు అవకాశము కల్పించబడినది.
Child Care Leave 180 Days | మహిళా/పురుష (Un-Married/ Widower/ Divorcee) ఉద్యోగులకు 180 రోజులుశిశు సంరక్షణ సెలవు (చైల్డ్ కేర్ లీవు) ఉపయోగించే విధానం
1.ఈ సెలవులను 3సార్లు తగ్గకుండా ఇద్దరి పిల్లల యొక్క వయస్సు 18 సం॥ల వరకు మరియు అశక్తులైన పిల్లల యొక్క (మానసిక/శారీరక వికలాంగులు) వయస్సు 22 సం॥లలోపు వరకు ఎన్నిసార్లు అయిననూ వినియోగించు కొనవచ్చు.
2. ఈ సెలవులను యల్.టి.సి. నిమిత్తంగా వాడుకొనుటకు అవకాశము లేదు. www.andhrateachers.in
3. ఈ సెలవులు వినియోగించుకొనిన వివరాలు జి.ఓ. నందు పొందు పరచబడిన సంబంధిత ప్రొఫార్మా ప్రకారంగా ఇ.యల్స్ మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు మాదిరిగా సర్వీసు రిజిష్టరు నందు నమోదు పరచుకొనవలెను.
4. ఈ సెలవులు ఇ.యల్స్ మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు నుండి తగ్గించబడవు.
5. ఈ సెలవులు కార్యాలయము/సంస్థ నిర్వహాణకు ఎటువంటి ఇబ్బందు లేకుండా మాత్రమే వినియోగించుకొనవలెను.
6. ఈ సెలవులు వినియోగించుకొనుట హాక్కుగా భావించరాదు. మంజూరు చేయు అధికారిని ముందుగానే అనుమతి తీసుకొని మాత్రమే వినియోగించుకొనవలెను.
7. ఈ సెలవులు సంపాదిత సెలవులుగానే పరిగణించాలి.
8. ఈ సెలవులు ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకొని అనగా సి.యల్స్ & స్పెషల్ సి.యల్స్ కాకుండా వినియోగించుకొనవచ్చు.
9. ఉద్యోగిని యొక్క ప్రొబేషన్ కాలము నందుకూడా వినియోగించుకొనవచ్చు కాని సదరు కాలము వరకు ప్రొబేషన్ కాలము పొడిగించబడును.
10. ఈ సెలవులను లీవ్ నాట్ డ్యూ గా అవకాశము కలదు.
పైన తెలుపబడిన సెలవులను 11వ పి.అర్.సి. ప్రతిపాదనలకు అనుగుణంగా పైన తెలుపబడిన నిబందనలు అనుసరించి 60 రోజుల నుండి 180 రోజులకు పెంచుతూ మరియు పురుష ఉద్యోగులకు (Un-Married/Widower/Divorcee) కూడా పూర్తి సర్వీసు మొత్తములో ది.01-01-2022 నుండి మాత్రమే వినియోగించుకొను అవకాశమును కల్పిస్తూ G.O.Ms.No. 33 (HR-IV-FR&LR) Fin. Deptt. Dt: 08-03-2022_ప్రకారంగా ఉత్తర్వులు జారీచేయడమైనది.
0 comments:
Post a Comment