చండీగఢ్: మాజీ ఎమ్మెల్యేల పింఛను విష యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్ని సార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటిం చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యు నిగా ఎన్నికైనవారికి పదవీకాలం ముగిశాక నెలకు రూ. 75 వేల చొప్పున పింఛను చెల్లిస్తు న్నారు. తరువాత ప్రతి పదవీకాలానికి ఈ పింఛను మొత్తంలో 66 శాతాన్ని అదనపు పింఛ ను ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు న్నర లక్షల నుంచి అయిదున్నర లక్షల రూపా యల వరకు పింఛను తీసుకునే మాజీ ఎమ్మె ల్యేలు ఉన్నారని మాన్ శుక్రవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ప్రజాసేవ చేసే అవ కాశమివ్వాలంటూ చేతులు జోడించి ఓట్లు అభ్య ర్థించే నేతలు.. తర్వాత భారీమొత్తాల్లో పింఛన్లు పొందడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment