#విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా ప్రభుత్వం చర్యలు
#నేటి నుంచి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ శిక్షణ
విద్యార్థుల్లోని సామర్ధ్యాలను మెరుగుపరిచేందుకు, అత్యుత్తమ బోధన అందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆధునిక సాంకేతికత ఆధారిత బోధనాభ్యసన ప్రక్రియలపై శిక్షణ అందించనుంది. ప్రముఖ సంస్థ టాటా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(స్) ద్వారా ముందు గా మాస్టర్ ట్రయినీలకు శిక్షణ ఇప్పించి.. వారి ద్వా రా ఉపాధ్యాయులందరికీ తర్ఫీదు ఇవ్వాలని నిర్ణ యించింది. ఈ వినూత్న బోధనాభ్యసన ప్రక్రియల కోసం రూపొందించిన 'కన్స్ట్రక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విత్ టెక్నాలజీ కోర్సును ఉపాధ్యాయు లకు ఉచితంగా టెస్ అందించనుంది. ఈ కార్య క్రమం మంగళవారం నుంచి ఆన్లైన్ వేదికగా ప్రారంభం కానుంది. ముందుగా ప్రతి జిల్లా నుంచి 50 మంది చొప్పున టీచర్లను ఎంపిక చేసి మొత్తం 650 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ ఆరు. నుంచి ఎనిమిది వారాల పాటు ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో కొనసాగుతుంది. టిస్ ప్లాట్ఫాం ద్వారా వారానికి ఏడు గంటలపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న వారికి ఆన్లైన్ పరీక్షలుంటాయి. కనీసం 40 మార్కులు సాధించిన వారికి కోర్సు పూర్తయినట్లు ధ్రువపత్రాలు అందిస్తారు. డిజిటల్ బోధనను రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానంలో అందించేలా ప్రభుత్వం టీచర్లకు ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయించిందని అధికారులు చెప్పారు.
0 comments:
Post a Comment