ఛత్తీస్ ఘడ్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నిలిపివేత

 ఛత్తీస్ ఘడ్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం ఇకపై డిడక్షన్ (కటింగ్స్) ఉండదు.


 పాత పెన్షన్ మరల అమలు చేయాలని నిర్ణయించడం వలన ఆర్థిక శాఖ తాజా ఆదేశాలు.


 ఛత్తీస్ ఘడ్ లో 1 జనవరి 2004 & ఆ తర్వాత నియామకం పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నందున *1 ఏప్రిల్ 2022* నుంచి ఉద్యోగుల జీతం నుంచి CPS కోసం చేసే నెలవారి తగ్గింపులు (కటింగ్స్) ఉండవు.

CPS ఉద్యోగులకు ప్రతి నెలా చేసే 10% Deduction ఆపివేసి, ఏప్రిల్ నుంచి  కొత్త జీతం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఈ నిర్ణయం వలన 2.95 లక్షల ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంతో లాభదాయకం.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 111 కోట్ల రూపాయలు మిగులుతాయి.

 ప్రతినెల ముంబైలోని NSDL కి  CPS కోసం (ఉద్యోగులు + ప్రభుత్వం వాటా) 221 కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు.

ఇక పై ఉద్యోగులకు PF అకౌంట్లు తెరిచి అందులో జమ చేయడం జరుగుతుంది.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top