పదోన్నతుల ద్వారా కొత్త జిల్లాలకు సిబ్బంది
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా, డివిజన్ స్థాయిలో అదనంగా అవసరమయ్యే వివిధ పోస్టులను ప్రస్తుతం ఉన్న అధికారులు, ఇతర సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.అర్హత ఉండి పదోన్నతుల కోసం వేచి చూస్తున్న వారందరికీ ప్రమోషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కృష్ణారెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. సిబ్బందిని కేటాయించే విషయంలో శాస్త్రీయంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
0 comments:
Post a Comment