*ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు త్వరలో ఒంటిపూట బడులు నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేయనున్నాము
*ఉపాధ్యాయులకు త్వరలో 33 వేల ప్రమోషన్స్ ప్రక్రియ
*వీటిని ఎవరో నకారత్మకంగా ప్రచారంచేస్తున్నట్లుగా పేపర్ ప్రమోషన్స్ కాదని, ఇంక్రిమెంట్లతో కూడిన ప్రమోషన్స్ అని స్పష్టం
*ఉపాధ్యాయుల శిక్షణను బలోపేతం చేయడానికి ఇప్పుడు ఉన్న 13 డైట్ లతో పాటు మరో 13 నూతన డైట్ లను ఏర్పాటు చేయాలని సీఎం గారు ఆదేశించారు
*హైస్కూల్ ఫ్లస్ పేరుతో నూతనంగా జూనియర్ కాలేజీలను కూడా ప్రారంభించి ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియ చేపడతాము
*ప్రమోషన్ల విధివిధానాలు, పోస్టుల సంఖ్యను త్వరలో ప్రకటించనున్నాము
0 comments:
Post a Comment