RBI Recruitment: రిజర్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారునోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది.? ఎన్ని పోస్టులు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోనూ ఖాళీలు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే చాలు.
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 17, 2022న ప్రారంభం కానున్నాయి, చివరి తేదీగా 08-03-2022ని నిర్ణయించారు.
* పరీక్షలను మార్చి 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.
0 comments:
Post a Comment