PRC Issues: మంత్రుల కమిటీ తో సచివాలయంలో కొనసాగుతున్న చర్చలు
మంత్రుల కమిటీ ఉద్యోగులతో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం నందు సమావేశం నిర్వహిస్తున్నారు .ప్రధానంగా ఈ నెల ఆరో తారీకు అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు చేపట్టిన సమ్మె విరమింప చేసే దిశగా మంత్రుల కమిటీ కొన్ని ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది నిన్న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఈరోజు ఉద్యోగులను చర్చలకు పిలిపించింది ఈ రోజు ముఖ్యమంత్రి రేపు ఉద్యోగులు సమ్మెకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజలు ఇబ్బంది పడతారని ఉద్యోగులతో మాట్లాడే సమ్మె విరమింప చేయాలని మంత్రుల కమిటీకి సూచించడం జరిగింది.
ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు మిశ్రా కమిటీ ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 3 డిమాండ్ల లో ఎలాంటి మార్పు లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి
ఎందుకంటే కొన్ని పోరాడి సాధించుకున్న హక్కులు కూడా కాపాడుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.
హెచ్ ఆర్ ఎ ల లలో మార్పులకు అంగీకారం:
న్యాయమైన పీఆర్సీ కోరుతూ ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ మంత్రుల కమిటీ చర్చల్లో పురోగతి కనబడుతోంది. హెచ్ఎస్ఏ శ్లాబుల్లో మార్పులకు మంత్రులు అంగీకారం తెలిపారు. దీంతో పాటు అదనపు క్వాంటమ్ పింఛను, తదితర అంశాల్లో మార్పులు చేసేందుకు అంగీకారం తెలిపారు. రెండు లక్షల వరకు జనాభా ఉంటే 8 శాతం హెచ్ఐస్ఏ, 2 నుంచి 5 లక్షల జనాభా ఉంటే 12 శాతం, 5 నుంచి 15 లక్షల మధ్య జనాభా ఉంటే 16 శాతం, 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 24 శాతం హెచ్ఎస్ఏను మంత్రుల కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే అదనపు క్వాంటం పింఛన్లో 70 ఏళ్ల వారికి 5 శాతం, 75 ఏళ్ల వారికి 10 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ ప్రతిపాదించింది.
సీపీఎస్ రద్దుపై మరో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతల బృందానికి తెలిపింది.
మంత్రుల కమిటీ ముందు ఈ కింది అంశాలను ప్రతి పాదించారు....
1. PRC రిపోర్ట్ బయట పెట్టాలని
2. ఫిట్ మెంట్ 30%, కనీసం 27కు తగ్గకుండా ఇవ్వాలని
3. HRA స్లాబ్ రేట్లు పాతవి కొనసాగించాలని
4. CCA కొనసాగించాలని
5. Pensioners కు అడిషనల్ క్వాంటమ్ 70 yrs 10%, 75 yrs కు 15% కొనసాగించాలని, funeral charges 20000 లేదా ఒక నెల పెన్షన్
6. కాంట్రాక్టు ఉద్యోగులకు పే, డి ఏ, HRA, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని
7. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్కేల్ మినిమం ఇవ్వాలని
8. గ్రామ సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ నుండి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని, 2022 PRC scales ఇవ్వాలని
9. మార్చి 31 లోగా CPS రద్దు పై నిర్ణయం తీసుకోవాలని
10. స్టేట్ PRC కొనసాగించాలనిఅడిగారు
PRC సాధన సమితి చర్చలు వీడియో: Click Here to watch
0 comments:
Post a Comment