IT Forms 2021-22 పూర్తి చేసే ముందు దు కింది విషయాలు పరిగణలోకి తీసుకుని IT forms సబ్మిట్ చేసుకోగలరు

 అందరు ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా IT (2021-22) కు సంబంధించి కింది విషయాలు పరిగణలోకి తీసుకుని IT forms సబ్మిట్ చేయవలసినదిగా తెలియజేయడమైనది. 

1. PF ఉపాధ్యాయులు DA arrears మీ PF ఖాతాలో పడినవో లేదో చెక్ చేసుకుని IT form సబ్మిట్ చేయవలయును. (బిల్ నెంబర్ కింది ఇవ్వబడినవి ఆ నంబర్స్ ని కింది ఇవ్వబడిన లింక్ లో చూసుకుని arrear అమౌంట్  pf కి adjust ఐనట్లు ఐతే టాక్స్ form లో చూపించవలయును. )

2. అలాగే CPS ఉపాధ్యాయులు DA arrear అమౌంట్ మీ ఖాతాలో జమ ఐనట్లు ఐతేనే టాక్స్ ఫారం లో చూపించవలయును. లేని యెడల చూపించనవసరం లేదు. 

3. జనవరి ఇంక్రిమెంట్ టీచర్స్ జనవరి లో పడిన అమౌంట్ ప్రకారం మాత్రమే టాక్స్ ఫారం లో చూపించవలయును. (ఇంక్రిమెంట్ పడలేదు కావున చూపించనవసరం లేదు )

4. ఫిబ్రవరి ఇంక్రిమెంట్ టీచర్స్ ఇంక్రిమెంట్ ను చూపించవలయును. 

5. ప్రతి ఉపాధ్యాయుని శాలరీ వివరములు ఆల్రెడీ గ్రూప్ నందు పోస్ట్ చేయబడినవి కావున అందరికి డిసెంబర్ వరకు same కావున అదే టాక్స్ ఫారం లో చూపించి జనవరి శాలరీ మీకు పడిన విధంగా చూపించవలయును. అలాగే టాక్స్ ఫార్మ్స్ తో మీకు పడిన జనవరి శాలరీ అమౌంట్ పే స్లిప్ ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకుని టాక్స్ ఫారం తో పాటు సబ్మిట్ చేయవలయును. 

6. ఫిబ్రవరి శాలరీ లో DA (10%) చూపించవలయును. (జనవరిలో 8% తో DA పడినది. 

7. ప్రతి ఉపాధ్యాయులు కింది ఇవ్వబడిన  PRC 2022 form డౌన్లోడ్ చేసుకుని 3 copies మరియు IT ఫార్మ్స్ ను రేపటిలోపు personal గా ఎవరికి వారు ఆఫీస్ కు వచ్చి సబ్మిట్ చేయవలయును. (PRC 2022 ఫారం SR ను చూసి ఫిల్ చేసి ప్రతి ఉపాధ్యాయులు సంతంకం చేయవలయును) 

8. అలాగే గత సంవత్సరం కొత్తగా మండలానికి వచ్చిన ఉపాధ్యాయులకు జనవరి 15 /16 వరకు మాత్రమే గత సంవత్సరం ఫైనాన్సియల్ ఇయర్ లో క్రెడిట్ ఐనవి. ఆ ఉపాధ్యాయులు జనవరి 15 లేదా 16 వరకు మాత్రమే గత ఏడాది IT లో చూపించినారు. అటువంటి వారు జనవరి 16/17 నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు టాక్స్ ఫారం నందు చూపించవలయును.(పే స్లిప్స్ నందు గమనించగలరు పే స్లిప్స్ ఆల్రెడీ గ్రూప్ నందు పోస్ట్ చేయడం జరిగినది.)

9. మార్చ్ 2021 నుండి ఫిబ్రవరి 2022 లోపు సరెండర్ లీవ్, HPL,AAS & ప్రమోషన్ ఇంక్రిమెంట్ క్రెడిట్ ఐన టీచర్స్ జాగ్రత్తగా పే స్లిప్ గమనించి టాక్స్ ఫారం లో చూపించవలయును. 

10. పైన తెలిపిన వాటిలో ఏ మాత్రం తేడా ఉన్న టాక్స్ ఫారం మరల చేయవలసి ఉంటుంది కావున జాగ్రత్తగా చూసుకుని సబ్మిట్ చేయవలెను

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top