పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల ఐదు నుంచి సహయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తామని.. ఏడు నుంచి సమ్మె మొదలు పెడతామని ప్రకటన చేశారు.మా సమ్మె వల్ల ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని.. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారని స్పష్టం చేశారు.
ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలని.. ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళ్లకుంటే పరిపక్వత లేదంటారా..? అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల వెనుక ఎవరో ఉన్నారు.. వాళ్లే ఉద్యమం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. మా వెనుక లక్షలాదిగా ఉద్యోగులున్నారని.. అర్థరాత్రి 12 గంటల వరకు సెక్రటేరీయేట్టులో వెయిట్ చేయించి అవమానం చేశారని నిప్పులు చెరిగారు. పోలీసుల వెనుక కూడా మేం ఉన్నామని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు తెలిపారు. పీఆర్సీ ఈ విధంగా ప్రకటించడం చరిత్ర.. ఈ ఉద్యమం కూడా చరిత్రే అంటూ స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment