ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రా టీచర్స్

 ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రా టీచర్స్

వ్యాసకర్త-యం.రాం ప్రదీప్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుండి విద్యాశాఖలో పలు మార్పులు తీసుకొచ్చింది.మన బడి-నాడు నేడు,అమ్మ వడి,జగనన్న విద్యా కానుక, గోరుముద్ద తదితర పథకాలని విజయవంతంగా అమలు చేస్తుంది. ఇటువంటి పథకాల వల్ల దాదాపు ఏడు లక్షల మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

నాడు నేడు తొలి దశలో దాదాపు 15 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి.మధ్యాహ్న భోజనం మెనూలో కూడా మార్పులు జరిగాయి. విద్యా కానుక కిట్లని కూడా ప్రభుత్వం అందజేస్తుంది.పాఠ్య పుస్తకాలలో కూడా మార్పులు వచ్చాయి.ప్రతి పాఠశాలలో ఆయా ఉన్నారు. ఫలితంగా పాఠశాలలు శుభ్రంగా ఉంటున్నాయి.


కరోనా కాలంలో  దేశం మొత్తం  పాఠశాలలని మూసి ఉంచితే, ఆంధ్రప్రదేశ్ లో విజయవంతం గా పాఠశాలలు నడిచాయి.విద్యాశాఖాధికారులు పై స్థాయిలో పలు సూచనలని ఎప్పటికప్పుడు ఇస్తుండగా,క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులు వాటిని తు. చ తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు.


2020 మార్చిలో కేంద్రం కరోనా కారణంగా కఠిన లాక్ డౌన్ ని ప్రకటించింది.అప్పటికింకా కరోనా వైరస్ స్వభావం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. దీనికి చికిత్స ఏంటో తెలియదు.2020 మే నుండే నాడు నేడు తొలి దశ పనులు పనులు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి.ఉపాధ్యాయినులు సైతం నాడు నేడు పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థికి అమ్మ వడి పథకం సక్రమంగా అందేటట్లు చూశారు. ఒక వైపు దీక్షా ద్వారా ఆన్ లైన్ శిక్షణ పొందుతూనే,విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయులు శిక్షణనిచ్చారు.2020 జూన్ 22నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లారు.2020 నవంబర్ నుండే విద్యార్థులకు ప్రత్యక్షంగా తరగతులు మొదలయ్యాయి.2021 ఏప్రిల్ నెలాఖరు వరకు పాఠశాలలు విజయవంతంగా నడిచాయి. డెల్టా వేరియంట్ వల్ల అదే నెల చివర్లో మరలా పాఠశాలలు మూత బడ్డాయి.2021 జులై 1నుంచే తిరిగి ఉపాధ్యాయులు  పాఠశాలలకు వెళ్లారు.2021 ఆగస్ట్ 16 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభ మయ్యాయి.మూడవ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో పాఠశాలలు మూత బడ్డా,ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు మూతబడలేదు.


తెలంగాణ రాష్ట్రం లో దాదాపు ఏడాది పాటు మొదటి వేవ్ తరువాత పాఠశాలలు మూతబడే ఉన్నాయి.కరోనా కాలంలో ఉపాధ్యాయులు డ్రై రేషన్,చిక్కీలు, గుడ్లు వంటివి సక్రమంగా పంపిణీ చేశారు. ఒక వైపు బోధనలో రాణిస్తూనే,మరి వైపు వివిధ రకాల యాప్స్ ని విజయవంతంగా  ఉపయోగిస్తున్నారు.ఇంకో వైపు 

వివిధ రకాల స్థానిక ఎన్నికల్లో వీరు చురుగ్గా పాల్గొన్నారు.కరోనా కాలంలో వీరు వలస కార్మికులకు,పేదవారికి భోజనాలు పెట్టారు.వివిధ ప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి,వీరు చేసేది సేవ కాకపోవచ్చు.కానీ నాడు నేడు వంటి పనులని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టింది. ఇటువంటి పనుల్ని ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో విజయవంతం చేశారు.ఈ విషయంలో ఆంధ్రా టీచర్లు అందరికీ ఆదర్శంగా నిలిచారు.


నూటికి 85 శాతం మంది ఉపాధ్యాయులు సక్రమంగానే పని చేస్తున్నారు.మిగతా ఉద్యోగులతో పోల్చుకుంటే వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొంత మంది తప్పు చేస్తుండవచ్చు.అంత మాత్రాన మొత్తం ఉపాధ్యాయులని నిందించడం సరికాదు.ఉపాధ్యాయులు ఎక్కడైనా మంచిగానే పని చేస్తారు.ప్రభుత్వాలు వారిని ప్రోత్సహిస్తూ,పని చేయించుకోవాలి.అవినీతి అంటే కేవలం డబ్భుని లంచంగా ఇవ్వడం, తీసుకోవడం మాత్రమే కాదు.పాఠాలు సక్రమంగా చెప్పక పోవడం కూడా అవినీతి క్రిందకే వస్తుంది.ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.విద్యా రంగ ఫలితాలని భౌతికంగా కొలవలేము. ఈ రంగంలో మార్పులు  గుణాత్మకమైనవి.అందుకే ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయాలి.


9492712836

తిరువూరు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top