ఏపీ సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు.పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగులు నిర్వహించిన 'చలో విజయవాడ' విజయవంతమైన నేపథ్యంలో సీఎంతో డీజీపీ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన డీజీపీ.. సీఎంను ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో నిన్న విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన సభ పైనే చర్చ జరిగినట్లు తెలిసింది. ఉద్యోగుల సభపై నిన్న కూడా పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశమై చర్చించినా ఆ భేటీలో డీజీపీ లేరు. పరిస్ధితి తీవ్రత దృష్ట్యా సీఎంను డీజీపీ ఈరోజు కలిసినట్లు సమాచారం. భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం జగన్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment