ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం: ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పీఆర్సీపై జీవోలను పిటిషనర్కు ఇవ్వాలని ఆదేశించింది. కౌంటర్ పాటు పీఆర్సీ నివేదికను దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య గత నెల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషనన్ను చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇది వరకే విచారణ జరిపిన హైకోర్టు ఏ ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దని ఆదేశిస్తూ ఇవాల్టికి విచారణ వాయిదా వేసింది. ఇవాళ మరోసారి రికవరీని తీవ్రంగా పరిగణిస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
0 comments:
Post a Comment