మే లో పదోన్నతుల సందడి......
తొలివిడత విలీన ప్రక్రియ మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వేసవి సెలవులకు ముందుగా ఉపాధ్యా యుల రేషనలైజేషన్ చేసేలా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత బదిలీలు, ఉద్యో గోన్నతుల ప్రక్రియను వరుసగా చేపట్టేలా ప్రస్తుతం పాఠశాల స్థాయి నుంచి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. విద్యాశాఖ వెబ్సై ట్లో తమ సర్వీసుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఉపాధ్యాయులు ఈ నెల 15వ తేదీనాటికి నమోదు చేసుకోవాలి. వాటిని ప్రాతిపది కగా తీసుకొని ఉద్యోగోన్నతులు ఇవ్వనున్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసి స్టెంట్ నుంచి హెచ్ఎం, అదే విధంగా ప్లస్టూగా మారే కాలేజీలో లెక్చరర్లుగా అర్హు లైన ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు లభిం చనున్నాయి. ...ఇలా కృష్ణ జిల్లాలో సుమారుగా ఏడు వందల మందికి ఒకే సారి ఉద్యోగోన్నతులు దక్కవచ్చని డీఈవో కార్యాలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
0 comments:
Post a Comment