ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతంకావడంతో ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం పెరింది. దీంతో పెన్ డౌన్ సిష్టం, యాప్ డౌన్ అంటూ ముందుకు వెళుతున్నారుశనివారం నుంచి సహాయ నిరాకరణ చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. అయితే సచివాలయంలో శనివారం సెలవు కావడంతో శుక్రవారంమే సహాయ నిరాకరణ కార్యక్రమం నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయించారు. అందులో భగంగా ఇవాళ పెన్ డౌన్, సిష్టం డౌన్, యాప్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అన్ని బ్లాకుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా నిన్న ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయితే.. ఇదంతా ప్రతిపక్షాల కుట్రని, ర్యాలీలో పాల్గొన్నవారంతా ఉద్యోగులు కాదని వ్యాఖ్యలు చేయడం ఉద్యోగ సంఘాల నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఛలో విజయవాడ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు సంబంధించినవారున్నట్లు నిరూపించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని, చర్చలకు రావాలని పిలవడం తప్ప.. ప్రభుత్వం నుంచి వేరే ప్రతిపాదన రాలేదని అన్నారు
0 comments:
Post a Comment