ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తూరులో రూ.2 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు ఫిబ్రవరి 7న భూమి పూజ జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ.. కోవిడ్ కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు నడిపిస్తామన్నారు. ప్రతి మండలానికి 2 లేదా 3 జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తామని చెప్పారు. రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని, అందులో భాగంగా ఫౌండేషన్ పద్ధతిని ప్రారంభించారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని, ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని అన్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల వరదాయిని వెలిగొండ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందన్నారు. వెలగలపాయ, పాపినేనిపల్లి లోయలకు వెలిగొండ నీటిని ఎత్తిపోతల ద్వారా అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment