ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు మరోసారి నిరాశ ఎదురైంది. పన్ను మినహాయింపుపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను టారిఫ్లపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వివరాలు వెల్లడించలేదు. దీంతో వేతన జీవులు బడ్జెట్పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభకు సమర్పించారు. ఆర్థిక బిల్లు - 2022ను ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం సాగింది.
దీనికితోడు రాష్ట్రంలో పనిచేస్తున్న సి.పి.ఎస్ ఉద్యోగులు ప్రస్తుతం వారి జీతం నుండి 10 శాతం ను కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం నకు జమ చేస్తున్నారు దానిని 14 శాతం పెంచుతూ కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది....
0 comments:
Post a Comment