The features and benefits of the overdraft facility in Salary Package Account are:
SBI Salary Account | features and benefits
Up to 2 times Net Monthly Salary, Overdraft limit set up on the existing CSP account
Minimum documentation
No processing fees
No pre-closure charges
Easy-to-use and easy-to-pay facility
Repayable in 6 months
Freedom to use limit through Cheque book, ATM, online transfer, etc.
Interest payable only on the utilized amount. Monthly Salary and other Credits in the account help save interest.
Who is Eligible to Overdraft Facility:
If you have minimum 6 months of residual service and your salary account with us has regular salary credits, then you are eligible for an Overdraft facility.
Salary Overdraft: శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి?ఎవరు అర్హులు..
అత్యవసరంగా డబ్బు అవసరం పడిందా?రుణం మంజూరు కోసం వేచి చూసేంత సమయం లేదా! అయితే శాలరీ ఓవర్‌డ్రాఫ్ట్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. మీరు జీతం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులైతే.. మీ శాలరీ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఈ సదుపాయం పొందచ్చు. అయితే, శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ సదుపాయం లభించదు. అర్హత ఉన్న వారికి మాత్రమే ఇది లభిస్తుంది.
ఓవర్ డ్రాఫ్ట్ అంటే..
ఖాతాదారులు తమ ఖాతాలో ఉండే మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని ఉపసంహరించుకోవడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ లో మీరు ఖాతా నుంచి విత్ డ్రా చేసే వరకు వడ్డీ వసూలు చేయరు. మీరు తీసుకున్న అధిక మొత్తంపై మాత్రమే వడ్డీ చెల్లించవలసి వుంటుంది. సాధారణంగా పొదుపు, కరెంట్ ఖాతాలపై ఈ సదుపాయం అందిస్తున్నాయి.
శాలరీ ఓవర్‌డ్రాఫ్ట్ ..
మీ జీతం ఖాతాలో పొందగలిగే రివాల్వింగ్ క్రెడిటే శాలరీ ఓవర్ డ్రాఫ్ట్. మీకు డబ్బు అవసరమైనప్పుడు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు మించి నిర్దిష్ట మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీనిపై తిరిగి చెల్లించేంత వరకు వడ్డీ పడుతుంది. ఏక మొత్తంగా గానీ, వాయిదాలలో గాని అదనంగా విత్డ్రా చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఆర్థిక అత్యవసరాలలో ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. జీతం ఖాతాలో నిధుల కొరత కారణంగా చెక్ బౌన్స్ అవ్వడం, ఈఎమ్ఐ, సిప్ మిస్ అవ్వకుండా ఇది సహాయపడుతుంది.
ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉంటుంది?
బ్యాంకులు తమ పాలసీని అనుసరించి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఇది వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉంటుంది. వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోరు ఆధారంగా ఆ వ్యక్తి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని నిర్ణయిస్తారు. బ్యాంకు, ఖాతాను బట్టి ఒక్కోసారి శాలరీ కంటే మూడింతలు అధికంగా లిమిట్ ఉంటుంది. కొన్ని బ్యాంకులు నెట్ శాలరీలో 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే అనుమతిస్తాయి.
నెట్ శాలరీ ఆధారంగా కొన్ని బ్యాంకులు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఆఫర్ చేస్తుంటే మరికొన్ని బ్యాంకులు రూ. 1 నుంచి రూ. 1.5 లక్షల వరకు, ఇంకొన్ని బ్యాంకులు రూ. 10వేల నుంచి రూ. 25 వేల వరకు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్‌ను ఇస్తున్నాయి. ఉదాహరణకి, హెచ్డీఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకులలో జీతం ఖాతా ఉన్న వారికి జీతంకు మూడు రెట్లు ఓవర్‌డ్రాఫ్ట్‌ను ఆఫర్ చేస్తుంటే, సిటిబ్యాంక్ సువిధ శాలరీ అకౌంట్ ఉన్న వారికి శాలరీపై ఐదింతల(రూ. 5 లక్షల వరకు) ఓవర్ డ్రాఫ్ట్‌ను ఇస్తుంది.
శాలరీ ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరికీ బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ ఆప్షన్ ఇవ్వవు. ఎంపిక చేసిన శాలరీ ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. రుణ చరిత్ర, అర్హతల ఆధారంగా ఎలిజిబిలిటినీ నిర్ణయిస్తారు. ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా తీసుకున్న వారికి ప్రాసెసింగ్ రుసములు వర్తిస్తాయి. వార్షిక పునరుద్ధరణ రుసములు ఉంటాయి.
శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ అనేది క్రెడిట్ కార్డు రుణం మాదిరిగా ఖరీదైన రుణంగానే చెప్పవచ్చు. వార్షిక వడ్డీ రేటు 12 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. చెల్లింపులు సమయానికి చేయకపోతే పెనాల్టీలు వర్తిస్తాయి. ఈ పెనాల్టీలు, ప్రాసెసింగ్ ఫీజులతో రుణం ఖరీదైనదిగా మారుతుంది. క్రెడిట్ కార్డుల మాదిరిగా వడ్డీ లేని కాలవ్యవధి ఉండదు. రివార్డు పాయింట్లు, ఆఫర్లు ఉండవు. విత్డ్రా చేసుకున్న రోజు నుంచి వడ్డీ వర్తిస్తుంది. అయితే మీ వద్ద డబ్బు ఉంటే ఒకేసారి మొత్తం రుణాన్ని చెల్లించే సదుపాయం ఉంటుంది. ఒకేసారి చెల్లించలేకపోతే.. నెలవారి వాయిదాలలో చెల్లించేందుకు ఈఎమ్ఐలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment