PRC News: మాటల ద్వారా మమ్మల్ని చర్చలకు రాకుండా చేస్తున్నారు
తమతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్ మైండ్తో లేదని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి తాము సిద్ధమని తెలిపారు. మాటల ద్వారా మమ్మల్ని చర్చలకు రాకుండా చేస్తున్నారని చెప్పారు. చర్చలకు ముందు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కాగితాలపై పుట్టిన సంఘాలతో చర్చించి న్యాయం చేసినా మంచిదేనని వ్యాఖ్యానించారు. సమస్యలపై తాము ఇప్పటికే వందల దరఖాస్తులు ఇచ్చామని గుర్తు చేశారు. తాము ఇచ్చిన 859 అభ్యర్థనలు పెండింగ్ ఉన్నాయని సీఎస్ చెప్పారని సూర్యనారాయణ పేర్కొన్నారు.
0 comments:
Post a Comment