PRC GO లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు
పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే సోమవారం హైకోర్టు విచారణకు చేపట్టింది.సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించారంటూ కోర్టులో జేఏసీ నేత కేవీ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని కృష్ణయ్య పేర్కొన్నారు. సెక్షన్ 78(1)కి విరుద్ధంగా ఉన్న జీవో1ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు.. కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
0 comments:
Post a Comment