ఉద్యోగ సంఘాల తో ముగిసిన సీఎం వై ఎస్ జగన్ భేటీ
సీఎం వై ఎస్ జగన్ ఉద్యోగ సానుకూల నిర్ణయాలను ప్రశంసించిన ఉద్యోగ సంఘాలు
సచివాలయ వ్యవస్థ తో గ్రామ స్వరాజ్యం తెచ్చారని ప్రశంసించిన ఉద్యోగ సంఘాలు
పి ఆర్ సి పై సీఎం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన బొప్పరాజు
సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న బొప్పరాజు
27 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఉండాలని కోరిన బండి శ్రీనివాసరావు
ఫిట్ మెంట్ 34 శాతం ఇవ్వాలని కోరిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
ఉద్యోగ సంఘాల అభిప్రాయాల అనంతరం మాట్లాడిన సీఎం జగన్
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు వివరించిన సీఎం వై ఎస్ జగన్
2, 3 రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సీఎం వై ఎస్ జగన్.
ఎంత మంచి చేయగలిగితే... అంత చేస్తానని ముఖ్యమంత్రి జగన్... ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని.. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తానని వారితో చెప్పారు. ప్రాక్టికల్ గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా.... కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని.... దయచేసి అందరూ ఆలోచన చేయాలని కోరారు. మంచి చేయాలన్న తపనతో ఉన్నామని..రెండు మూడు రోజుల్లో PRC ప్రకటన ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. నేను మీ అందరి కుటుంబ సభ్యుడినని... మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నానని ఉద్యోగ సంఘాలకు సీఎం చెప్పారు.
0 comments:
Post a Comment