గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తొలి దశలో 5 ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధికి నిర్ణయించారు. ప్రతి జిల్లాకో లేఅవుట్ విధిగా ఉండాలన్న ప్రభుత్వ తాజా ఆదేశాలతో మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్ భూముల సేకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రైవేటు భూములను ప్రభుత్వ ధరకంటే 5 రెట్ల విలువకు మించకుండా సేకరించనున్నారు. అసైన్డ్ భూములను రైతులు, ప్రజల నుంచి భూసమీకరణ పథకం (ఎల్‌పీఎస్) కింద తీసుకోనున్నారు. 150, 200, 240 చ.గజాల్లో మూడు కేటగిరీల కింద ప్లాట్లను తయారుచేసి విక్రయిస్తారు.
Jagananna Smart Town Registration Link
0 comments:
Post a Comment