నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)లోని పలు విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 150
*దరఖాస్తుకు చివరి తేది: 2022 జనవరి 18
*ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు-145, డిప్లొమా అప్రెంటిస్‌లు-05 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ పాసై ఉండాలి.
*2022 జనవరి 31 నాటికి 25 ఏళ్ల వయస్సు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం బీఈ, బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కులను చూస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ecil.co.in వెబ్ సైట్ ను చూడొచ్చు.
0 comments:
Post a Comment