CM Review: పూర్తైన CM JAGAN వైద్య శాఖ సమీక్ష - సమీక్ష ముఖ్యాంశాలు

రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నందు సీఎం గారు సూచించిన ఆదేశాలు:



 ► కాల్‌సెంటర్‌ పటిష్టంగా పనిచేయాలని అదేశం

►టెలిమెడిసిన్‌ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

►ప్రికాషన డోస్‌ వేసుకునేందుకు ఇప్పుడున్న 9 నెలల వ్యవధిని 6 నెలల వ్యవధికి తగ్గించాలంటూ కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం

►ఈ వ్యవధిని 3 నుంచి 4 నెలలు తగ్గించే దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి లేఖరాయాలని సీఎం నిర్ణయం

►దీనివల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్నావారికి ఉపయోగమని సమావేశంలో అభిప్రాయం

►అంతేకాకుండా ఆస్పత్రిపాలు కాకుండా చాలామందిని కోవిడ్‌నుంచి రక్షించే అవకాశం ఉంటుందన్న సమావేశంలో నిర్ణయం

►రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

►తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం.

►15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు

►మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్‌

►మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం ఆదేశం

►మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top