కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను విధిస్తూ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అలాగే థియేటర్లు, మాల్స్‌లో 50 శాతం అక్యుపెన్సీ ఉండాలని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసారు. అటు ప్రార్ధనా మందిరాలలో కూడా కోవిడ్ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి, భౌతిక దూరం వంటి నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment