రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్ అమలు చేసి, వారికి పిఆర్సిని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జెఎసి డిమాండ్చేసింది. ఈ మేరకు జెఎసి చైర్మన్ ఏవి నాగేశ్వరరావు, సెక్రట రిజనరల్ ఎం బాలకాశీలు ఆదివారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిని పంపారు. రాష్ట్రంలో విద్య, వైద్య శాఖలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్శిటీలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలు, పథకాల్లో పథకాల్లో 2,40,000మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, 60వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు కనీసవేతనాలకు నోచకుండా పనిచేస్తున్నారని తెలిపారు. సమానపనికి సమానవేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు వున్నా రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం. లేదని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబందించిన అంశాల్లో స్పష్టత లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్డమ్, డైలీవేజ్, కంటింజెంట్, టైమ్ స్కేల్ ఉద్యోగులకు ప్రారంభతేదీ నుండి పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామిని అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగునంగా కనీస మూల వేతనంగా రూ.25 వేలను ప్రకటించి అమలు చేయాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment