దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది.
7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు
►జనవరి 14న యూపీలో తొలిదశ నోటిఫికేషన్
►తొలి దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి - 10
►రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి -14
-(పంజాబ్, గోవా,ఉత్తరాఖండ్ ఎన్నికలు ఫిబ్రవరి -14)
-ఒకే దశలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికలు
►మూడో విడత పోలింగ్ ఫిబ్రవరి -20
►నాలుగో విడత పోలింగ్ ఫిబ్రవరి -23
►ఐదో విడత పోలింగ్ ఫిబ్రవరి -27
►మార్చి 3న యూపీ ఆరో విడత ఎన్నికలు
►మార్చి 7న ఏడో విడత ఎన్నికలు
►మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
►ఫిబ్రవరి 27న మణిపూర్ తొలివిడత ఎన్నికలు
►మార్చి 3న మణిపూర్ రెండో విడత ఎన్నికలు
►మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
0 comments:
Post a Comment