ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో కోత విధించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఆఫీస్ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 30 శాతం నుంచి 16 శాతానికి కోత విధించింది. రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ, వెలగపూడి సచివాలయ ఉద్యోగులకు మూలవేతనంలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ, రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్ల వయసు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. గతంలో 70 ఏళ్లు దాటాక 15 శాతం అదనపు పెన్షన్ ఇచ్చింది. పాత శ్లాబ్‌ను జగన్‌రెడ్డి సర్కార్ రద్దు చేసింది. 80 ఏళ్లు దాటిన తర్వాత 20 శాతం, 85 దాటిన తర్వాత 30 శాతం, 90 ఏళ్లు దాటాక 40 శాతం, 95 ఏళ్లు దాటాక 50 శాతం, 100 ఏళ్లు దాటిన తర్వాత 100 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన సీసీఏను ప్రభుత్వం రద్దు చేసింది. విజయవాడ, విశాఖలో పని చేసే ఉద్యోగులకు గత ప్రభుత్వం సీసీఏ ఇచ్చింది.
0 comments:
Post a Comment