11వ వేతన సవరణ ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణ ఆమోదయోగ్యం కాదు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు "పి.ఆర్.సి. సాధన సమితి" గా ఏర్పడుట - నిరవధిక సమ్మెతో సహా ఉద్యమ కార్యాచరణ నిర్ణయించుట సమ్మె నోటీసు జారీచేయుటకు అపాయింట్ మెంట్ కోరుట- గురించి.
"పి.ఆర్.సి. సాధన సమితి" ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి చేసిన ప్రాతినిధ్యాలు
సూచిక:
1) జి.వో.ఎమ్.ఎస్. నెం. 1, 2 & 8, ఆర్థికశాఖ, ది. 21-01-2022.
2) ది.21-01-2022న జరిగిన పి.ఆర్.సి. సాధన సమితి ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానములు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పై 1వ సూచికలో ప్రకటించిన మరియు ది.21-01-2022న మంత్రివర్గం తీర్మానించిన 11వ వేతన సవరణ, ఉద్యోగవర్గం ప్రయోజనాలకు భంగం కలిగించు రీతిలో ఉన్నందున దీవితో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు అన్నీ అంగీకరించుటలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు అన్నీ కలిసి" పి.ఆర్.సి. సాధన సమితి"గా ఏర్పడి, నిరవధిక సమ్మెతో సహా ఉద్యమ కార్యాచరణమ నిర్ణయించినది.
కావున ది. 24-01-2022న పి.ఆర్.సి. సాధన సమితికి చెందిన పన్నెండు (12) మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం ఉద్యమ కార్యాచరణ మరియు సమ్మె నోటీసును జారీచేయుటకు అపాయింట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.
జనవరి 2022 జీతాలకు సంబంధించి పాత విధానాన్నే కొనసాగించాలని సీఎస్ ను కోరారు
0 comments:
Post a Comment