ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నం
సమస్యలపై చర్చకు ఉద్యోగులను ఆహ్వానించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వంతో చర్చలకు ఉద్యోగులు రాలేదన్నారు.మూడు రోజులు ఎదురు చూసినా ఉద్యోగులు రాలేదన్నారు. ఇకపై జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ వేశారని తెలిపారు. ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలని, రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. నిరసన చేస్తూనే జీతాలు ఇవ్వమంటున్నారని, తాము ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.
పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యులు ను ప్రభుత్వంతో చర్చలు కు పంపిన విషయం మన అందరికి తెలిసిందే...
0 comments:
Post a Comment