ఫిట్‌మెంట్ పై ముగిసిన సీఎం సమీక్ష
ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష ముగిసింది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా పలు డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చించారుఉద్యోగులకు ఎంతమేర ఫిట్‌మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం సమాలోచనలు జరిపారు. ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశంపై సీఎం జగన్‌కు ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ మరోసారి చర్చలు జరుపనున్నారు. అనంతరం ఫిట్‌మెంట్ ఖరారు చేసే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment