ప్రధానంగా మూడు డిమాండ్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరాం: బండి శ్రీనివాసరావు
పీఆర్సీ కోసం ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో ఉద్యోగుల దీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నేతలు పాల్గొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వ జీవోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను మంత్రుల కమిటీకి తెలిపామన్నారు. ప్రధానంగా మూడు డిమాండ్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరామన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేధికను బయట పెట్టాలని, ఉద్యోగులకు ఈనెలకు పాత జీతాలు ఇవ్వాలని కోరామన్నారు. అయితే తమ డిమాండ్ల లేఖపై మంత్రుల కమిటీ నుంచి ఎలాంటి జవాబు రాలేదన్నారు. కొత్త వేతనాలిచ్చేందుకు డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, అధికారులు హడావుడి చేయడం మానుకోవాలని బండి శ్రీనివాసరావు సూచించారు.
0 comments:
Post a Comment