వద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాల జెఎసి నిర్ణయం
కొత్త పిఆర్సి, పే స్కేళ్లకు వ్యతిరేకంగా సమ్మెలోకి వెళ్లాలని వైద్యాగర్యోశాఖ ఉద్యోగ సంఘాల జెఎసి నిర్ణయించింది. పిఆర్సి పోరాట కమిటీతో పాటు ఈ నెల 6 తేదీ. అర్ధరాత్రి నుంచి ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారని ప్రకటించింది. విజయవాడలోని ఎపిఎఓ భవన్లో వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘాలు సమావేశమై జెఎసిగా ఏర్పాటయ్యాయి. ఈ సమావేశానికి పిఆర్సి పోరాట కమిటీ నాయకులు శివారెడ్డి తదితరులు హాజరై సమ్మె గురించి వివరించారు. ప్రభుత్వం తక్షణమే పిఆర్సి ఓలను వెనక్కి తీసుకోవాలని జెఎసి నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైద్యారోగ్యశాఖ లోని అన్ని విభాగాలకు చెందిన వారు సమ్మె లోకి వెళతారని నాయకులు హెచ్చరించారు.
0 comments:
Post a Comment