నూతన వేతన సవరణ అమలుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జిఓ 1ని సవాల్ చేసిన రిట్ పిటిషన్ను విచారణ చేపట్టాలని ఎపి గెజిటెడ్ ఆఫీసర్స్ జెఎసి అధ్యక్షులు, పిటిషనరు కెవి కృష్ణయ్య తరపున న్యాయవాది పదిరి రవితేజ మంగళవారం హైకోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించారు. జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణకు వస్తే రోస్టర్ ప్రకారం సిజెకు నివేదించాలని ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన సిజె, ఈ కేసు ఫైల్ తమకు రిజిస్ట్రీ నివేదించలేదని అన్నారు. రిజిస్ట్రీ నుంచి ఫైల్ అందగానే తగిన నిర్ణయం వెంటనే తీసుకుంటామని, కేసును ఏ బెంచ్కు కేటాయించాలనే పరిపాలనా పరమైన వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment