గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు పదకొండవ PRC కి సంబంధించి మాన్యులు శ్రీ యుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటన చేస్తూ 23.29 శాతం fitment ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఉద్యోగ వర్గాల్లో ఎంతో ఆందోళన నెలకొంది. ఎందుకనగా మనం ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భ్రుతి ని తీసుకుంటున్నాము. fitment అనేది అంతకంటే తక్కువ ఉంటే అది నష్ట దాయకం అనేది అందరకూ తెలిసిందే. కాని విచిత్రంగా కొంత మంది ఉద్యోగ సంఘ నాయకులు ఇది మంచి fitment అంటున్నారు. మరి వారికి విషయం తెలియదా లేక తెలియనట్లు నటిస్తున్నార అనేది. చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం వారి తరపున ముఖ్యమంత్రి వర్యులు వారు ఇవ్వదలచుకున్నది ప్రకటించారు. అయితే వీరు ఎలా ఒప్పుకున్నారు అనేది సందేహం. ఎందుకంటే అక్కడ వారు కూచున్నది వ్యక్తి గతంగా కాదు. దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యుల ప్రతినిధులుగా. ఒక వేళ అక్కడకు పోక ముందే ఈ విషయం తెలియలేదు అని వారు చెపితే నమ్మడానికి సిద్ధంగా ఉద్యోగులు లేరు. తెలిసీ వెళ్ళారంటే మాత్రం ఉద్యోగులను దారుణంగా మోసం చేయడమే. ఇక్కడ మనం ప్రభుత్వాన్ని తప్పు బట్టే అవకాశమే లేదు. మన తరపున పోయిన వాళ్ళు వెన్నెముక లేని వాళ్ళు అయిపోయారు. ఏ స్వార్ధం లేకుంటే ఇంతమంది ఉద్యోగులను ఇబ్బంది పెట్టి ఇటువంటి వేతన సవరణ కు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. ..ఇక మన ఘనత వహించిన నాయకులు చెపుతున్నట్లు గా ఈ PRC నిజంగా లాభదాయకమేనా అనేది చూద్దాం.
ముందుగా పాత అనగా ప్రస్తుతం పొందుతున్న PRC 2015 ప్రకారం ప్రస్తుతం మనకు రావలసిన DA లు చూద్దాము. ఇటీవల ఇచ్చిన తో కలపి మనం పొందుతున్నది. 01-07-2019 ప్రకారం 38.776 % వాస్తవంగా 01-07-2021 కి కేంద్ర ప్రభుత్వ కరువు భత్యం కి దామాష ప్రకారం రావలసిన కరువుభత్యం ఎంతో చూద్దాం.
As on (01-01-2020] 4% + [01-07-2020] - 3% +[ 01-01-2021] - 4% and [01-07-2021] - 3% TOTAL 14% ఈ పద్నాలుగు శాతం కరువు భత్యానికి దామాష ప్రకారం అనగా 1.048 ప్రకారం మనకు రావలసిన కరువు భత్యం 14.672
అనగా మనకు 01-07-2021 నాటికి రావలసిన మొత్తం కరువు భత్యం 53.448%. దీనిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రస్తుతం
పొందవలసిన జీతం గురించి చూద్దాము. ఒక ఉదాహరణ గా రూ.52590-00 బేసిక్ ను తీసుకుందాము.
0 comments:
Post a Comment