★ 11 వ PRC & సెక్రటరీల రిపోర్టు లో సిఫార్సు చేసిన క్రొత్త సెలవులు ఇలా ఉన్నాయి.
★ బోధనేతర మహిళా ఉద్యోగులకు కూడా సం!!నకు 5 అదనపు ప్రత్యేక సెలవులు.thank
★ ఇద్దరు పిల్లలు కంటె తక్కవ సంతానం కలిగి, One year లోపు పుట్టిన బిడ్డను చట్టపరంగా దత్తత తీసుకొనే మహిళా ఉద్యోగులకు 180 రోజుల "శిశు దత్తత సెలవు"( child Adoption Leave) ఇవ్వాలి.
★ అవివాహిత/ భార్యచనిపోయిన/విడాకులు తీసుకొన్న ఒంటరి పురుష ఉద్యోగులు, 6 నెలల తక్కువ వయస్సు ఉన్న శిశువులను దత్తత తీసుకొంటే వారికి కూడా 15 రోజుల పితృత్వ సెలవు ఇవ్వాలి.
★ కేంద్ర ప్రభుత్వం తో సమానంగా 180 రోజుల శిశు సంరక్షణ సెలవు ను మహిళా ఉద్యోగులకే కాక ఒంటరి అవివాహిత/భార్యాచనిపోయిన/విడాకులు ఇచ్చిన పురుష ఉద్యోగులకు కూడా ఇవ్వబడినది.
★ కృత్రిమ అవయవాలు (prosthetic aides) అవసరమున్న దివ్యాంగ ఉద్యోగులకు సం!! నకు 7 రోజుల Special casual leave ఇవ్వబడును.
★ గుండె, మెదడు, మూత్రపిండముల తదితర వ్యాధులతో బాధపడుతూ జీతనష్టపు సెలవు పై ఉన్న ఉద్యోగులకు ఇచ్చే Ex-gratia పెంచబడును.
0 comments:
Post a Comment