పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమీషనర్, రాష్ట్ర పథక సంచాలకుల & అడ్వైజర్, ఇన్ఫ్రా వారు SCERT లో నిర్వహించిన JDs, DEOs and APCల సమీక్షా సమావేశంలోని ముఖ్యంశాలు..

 నిన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమీషనర్, రాష్ట్ర పథక సంచాలకుల & అడ్వైజర్, ఇన్ఫ్రా వారు SCERT  లో నిర్వహించిన JDs, DEOs and APCల సమీక్షా సమావేశంలోని ముఖ్యంశాలు....

👉 3,4&5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో వీలీనం సందర్భంగా ఉపాధ్యాయుల సర్దుబాటు (1:20 & 1: 30)

👉 ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలోకి మాత్రమే కలపాలి. 

👉 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను ప్రస్తుతానికి మెర్జింగ్ ప్రక్రియ కు పరిగణించవద్దు. 

👉 ఒక కిలోమీటరు లోపు వేరే మండలం పాఠశాల వున్నా యాజమాన్యం ఒకటే అయితే తరగతులను కలపలచ్చు.

👉 20 కన్నా తక్కువ స్ట్రంక్త్ వున్న ప్రాథమిక పాఠశాలలను మెర్జింగ్ కు పరిగణలోకి తీసుకోరు

👉 100 కన్నా తక్కువ స్ట్రంక్త్ వున్న ఉన్నత పాఠశాలలోకి వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు

👉 అదేవిధంగా 1000 కన్నా  ఎక్కువ స్ట్రంక్త్ వున్న ఉన్నత పాఠశాలలోకి వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు

👉 బాలికల పాఠశాలలోకి కూడా వేరే ప్రాంతం నుంచి అనగా 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతులు కలపకూడదు.

👉 20 కన్నా తక్కువ 40 లోపు స్ట్రంక్త్ వున్న ప్రాథమిక పాఠశాలలకు ఒక తరగతి గది మాత్రమే పరిగణించబడును

41 నుంచి 100 లోపు 2 తరగతి గదులను పరిగణనలోకి తీసుకోబడును.

👉 100 స్ట్రంక్త్ పైన వున్న ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే తరగతికి ఒక గది సూత్రం వర్తిస్తుంది. 

👉 జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కి సంబంధించి ఏ పిల్లలకైతే  కిట్ల పంపిణీ చేయలేదు దానికి గల కారణాలను నూతన వెర్షన్ APP లో పొందుపరచడానికి ఆప్షన్ ఇచ్చారు. తక్షణమే ప్రధానోపాధ్యాయులందరు ఆ ఆప్షన్ లో సదరు విద్యార్థుల సమాచారాన్ని అప్లోడ్ చేయాలి.

👉 మండలాల్లో మిగిలిన జెవికె కిట్లను తక్షణమే DPO కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి తరలించాలి.

👉 నిష్ఠా 2, 3 లో ఉపాధ్యాయులు అందరి నమోదు తప్పనిసరి

👉 PFMS అకౌంటెంట్ల నెంబర్లు త్వరితగతిన పాఠశాలలకు వచ్చేలా బ్యాంకు మేనేజర్లతో సంప్రదింపులు జరపాలి.

👉 పాఠశాలల పిసి ఖాతాల్లో వున్న నిధులను తక్షణమే వినియోగించాలి. ఖాతాల్లో వుంచరాదు.

👉 జిల్లా కార్యాలయానికి జమచేయవలసిన పెండింగ్ అడ్వాన్సులను తక్షణమే చెల్లించాలి లేదా సంబంధిత ఖర్చుల UC లు మరియు బిల్లులు సమర్పించాలి.

👉 కోవిడ్ - 19 లో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల వివరాలు తక్షణమే సమర్పించాలి.

👉 జిల్లా పథక సంచాలకుల కార్యాలయంలో పెండింగ్ లో వున్న అన్ని బిల్లులను ఫైల్స్ ను అత్యంత త్వరితగతిన క్లియర్ చేయాలి.

👉 మండలాల్లోని వున్న ఉన్నత పాఠశాలల్లోని అటల్టింకరింగ్ ల్యాబ్ లన్నీ వినియోగంలో ఉన్నాయో లేదో సమీక్షించి నివేదిక సమర్పించాలి.

👉 నాడు-నేడు మొదటి విడత పాఠశాలల ప్రోజెక్టులను క్లోజ్ చేసాక పనులన్నీ పూర్తి అయి వుండాలి అసంపూర్తిగా వున్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోబడును.

👉 WE LOVE READING క్రమం తప్పకుండా నిర్వహించాలి.

👉 FA1 మార్కుల పోస్టింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయవలె.

👉 స్టూడెంట్ ఇన్ఫో లో మేపింగ్ ప్రక్రియ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తక్షణమే పూర్తి చేయవలెను.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top