గ్రామ సచివాలయాల ద్వారానే కీలక పౌరసేవలను అందిస్తోంది. ఇటీవలే జగనన్న శాశ్వత గృహహక్కు పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను కూడా గ్రామ సచివాలయాల్లోనే చేపడుతోంది. అలాగే గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మరిన్ని సేవలను గ్రామ సచివాలయాల ద్వారా అందించేందుకు సీఎం జగన్ (AP CM YS Jagan) రంగం సిద్ధం చేశారు. మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశమైన సీఎం.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవల అందించే అంశాలను పరిశీలించాలని సీఎం జగన్.. బ్యాంకింగ్ సంస్థలకు సూచించారు.
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు పెట్టేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయన్న సీఎం.. ఇప్పటికే జగనన్న పాలవెల్లువ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని.. దీంతో పాటు రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని తెలిపారు. సచివాలయాల్లో ఏటీఎంల ఏర్పాటు ద్వారా లావాదేవీల ప్రక్రియ కూడా జరుగుతుందని.., ఈ నేపథ్యలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌సేవలు విస్తృతం కావాలన్నారు.
0 comments:
Post a Comment