ఈరోజు వెలగపూడి లో సెక్రటేరియట్ సమావేశ మందిరంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు,,మరియు ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారితో PRC, CPS, 5 DA లు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం చర్చలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం ఇప్పుడు ఆర్దిక మంత్రి వద్దకు చేరింది. ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గనతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలను సమావేశానికి ఆహ్వానించారు.
ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ తో పాటుగా 70కి పైగా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో పీఆర్సీకి సంబంధించి సీఎస్ నాయకత్వంలోని అధికారుల కమిటీ సీఎంకు నివేదించింది. అయితే, సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదిక.. సిఫార్సు ల పైన ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఇక, ఉద్యోగ సంఘాలతో విడి విడిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల సమావేశమయ్యారు.
బుగ్ శాతం పీఆర్సీ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 30 శాతం పీఆర్సీ అమలు చేస్తుండటంతో..అంత కంటే ఎక్కువగా సీఎం జగన్ ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ తో ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ఉంటుందని ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా ఆర్ధిక శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేసారదు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున బుగ్గన మరోసారి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి ని వివరించనున్నారు. దీంతో పాటుగా.. ఇప్పటికే అమలు చేస్తున్న 27 శాతం ఐఆర్ ను పీఆర్సీగా ఖరారు చేసే విధంగా ప్రతిపాదన చేస్తారని విశ్వసనీయ సమాచారం.
పీఆర్సీపైన క్లారిటీ ఇస్తారా
ఉద్యోగ సంఘాల స్పందన చూసిన తరువాత బుగ్గన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రికి వివరించనున్నారు. అయితే, సీపీఎస్ గురించి మాత్రం ప్రభుత్వం తమ వైఖరి ఏంటనేది ఇప్పటికే స్పష్టత ఇచ్చేసింది. మిగిలిన సమస్యల పైన ప్రభుత్వం పరిష్కారానికి సిద్దంగానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, పీఆర్సీ పైన మాత్రం ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనలను ఇప్పుడు బుగ్గన ముందు ఉంచే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రకటించే పీఆర్సీ 2018 నుంచే అమలు చేయాల్సి ఉండగా... చేతికి ఇచ్చేది మాత్రం వచ్చే ఏడాది నవంబర్ నుంచి అని చెబుతున్నారు.ఇందుకు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సిద్దంగా లేరని తెలుస్తోంది. దీంతో..మధ్యే మార్గంగా 2022 ఏప్రిల్ నుంచి అమలు పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ఒప్పిందం కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అసలు ముందుగా బుగ్గన వద్ద పీఆర్సీ పైన పిట్ మెంట్ పైన తుద నిర్ణయం జరిగే అవకాశం మాత్రం కనిపించటం లేదు. ఉద్యోగ సంఘాలు తాము ఎంతకు అంగీకరించే అంశాన్ని స్పష్టంగా చెప్పేందుకు సిద్దం అవుతున్నారు. దీంతో.. బుగ్గన వద్ద జరిగే సమావేశం లో పీఆర్సీ పైన అదే విధంగా.. ముఖ్యమంత్రితో చర్చల పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment