మా డిమాండ్ PRC ఒకటే కాదు... ఉద్యమం కొనసాగుతోంది

 


ఓ వైపు ఇప్పటికే పీఆర్సీ ప్రిక్రియ పూర్తి అయ్యింది.. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతుంటే..తమ ఆందోళన మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్. మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు. మాకు పీఆర్సీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదన్న నేతలు. పది రోజుల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం అని సీఎం చెప్పినట్లు మీడియాలో చూశామని.. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని వెల్లడించారు..అయితే, పీఆర్సీ నివేదిక పై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ప్రకటించటం సంప్రదాయం అని గుర్తుచేశారు ఉద్యోగ సంఘాల నేతలు.. నివేదికలో ఫిట్ మెంట్ దగ్గర నుంచి చాలా అంశాలు ఉంటాయని.. మా డిమాండ్లలో పీఆర్సీ ఒక్కటే లేదని.. ఇంకా 55 డిమాండ్లు ఉన్నాయని తెలిపారు.. మిగిలిన డిమాండ్ల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనంత వరకు మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే తమ డిమాండ్లపై సీఎస్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెట్టిన సంగతి విదితమే.

ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘పీఆర్‌సీ రిపోర్టు ఇవ్వాలని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేశాం. అన్ని సంఘాలూ అందుకే పట్టుపట్టాయి. పీఆర్‌సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చేలా సీఎం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి హామీ రాలేదు. అందుకే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 7 నుంచి నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఉద్యోగులను మాత్రం సంక్షోభంలోకి నెట్టింది. మాకు రావాల్సిన రూ.1,600 కోట్ల బకాయిల గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యమంలోకి వెళ్తున్నాం’ అని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

* ‘నివేదిక ఇవ్వకుండా పీఆర్‌సీ ప్రకటిస్తే అంగీకారం కాదు. పీఆర్‌సీ అంటే ఫిట్‌మెంట్‌ ఒక్కటే కాదు. పే స్కేళ్లు, ఇంక్రిమెంట్లు తదితర అంశాలపై కమిటీ నివేదికలో ఏం చెప్పిందనేది తెలియకుండా ఎలా చర్చిస్తాం?’ అని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు.

* ‘ప్రభుత్వం నిర్వహించిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఛైర్మన్‌, కార్యదర్శి లేరు. ఈ రోజు జరిగింది జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం కాదు. ఇందులో చర్చ ఏమీ జరగలేదు. జనవరి వరకు వేచి చూసి మా కార్యచరణను మేం ప్రకటిస్తాం’ అని  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top