PRC Latest Update:
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తో ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు గురువారం నాడు ఉదయం భేటీ అయ్యారు.
బుధవారం నాడు Employees సంఘాలతో జరిగిన చర్చల వివరాలను సీఎంకు వివరించారు.నిన్న 13 ఉద్యోగ సంఘాలతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, Sajjal Ramakrishna Reddyలు చర్చించారు. అయితే ఈ చర్చల పట్ల ఉద్యోగ సంఘాలు సంతృప్తిగా లేవు. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాల నేతలు పలు డిమాండ్లు ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని ప్రభుత్వం తరపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు వివరించారు. సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ 14.29 ఫిట్‌మెంట్ ను సిఫారసు చేసింది. అయితే ఈ ఫిట్‌మెంట్ పై ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సంతృప్తిగా లేవు. ఈ విషయమై Ys Jagan కు నేతలు వివరించారు. అయితే ఈ విషయమై సీఎం నిర్ణయం ఎలా ఉంటుందనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ సంఘాలతో సీఎం కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్ విషయమై తేలాల్సి ఉంది.
ఏపీ జేఏసీ, ఏపీ జేఎసీ అమరావతి నేతలు 55 శాతం prc fitment ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం 34 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 40 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు మానిటరీ బెనిఫిట్స్ ను వచ్చే ఏడాది అక్టోబర్ నుండి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ విషయమై కూడా ఉద్యోగ సంఘాల నేతలు పట్టు వీడడం లేదు.prc విషయమై ఇప్పటికే AP Jac, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వంతో చర్చలకు నల్ల బాడ్జీలను ధరించి చర్చలకు హాజరయ్యారు. సీఎంతో జరిగే చర్చలకు కూడా తాము నల్లబాడ్జీలతో హాజరౌతామని కూడా ఈ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. అయితే సీఎంతో చర్చల సమయంలో నల్లబాడ్జీలు లేకుండా రావాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కోరారు. అయితే తమ ఉద్యమ కార్యాచరణను వీడేదీ లేదని ఉద్యో సంఘాల నేతలు తేల్చి చెప్పారు.
0 comments:
Post a Comment