PRC News: ఈరోజు CM అధికారులతో భేటీ తర్వాత అయిన PRC పై స్పష్టత వచ్చేనా?


PRC News: ఈరోజు CM అధికారులతో భేటీ తర్వాత అయిన PRC పై స్పష్టత వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంబంధించిన PRC విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి  అధికారులతో మరోసారి సమావేశం కానున్నారు. 14.29శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రభుత్వ చేసిన ప్రతిపాదనలను మూకుమ్మడిగా అన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి.అనేకసార్లు సీఎస్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ... జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు జరిపినా పీఆర్సీపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయింది. మరోవైపు పీఆర్సీ ప్రకటనతో పాటుగా మానిటరి బెనిఫిట్‌ ఎప్ప టి నుంచి ఇవ్వాలి అనే అంశాలపైనా ప్రభుత్వం తరచూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం  10వ పీఆర్సీలో 10 నెలల ఎరియర్స్‌ను ఉద్యోగులకు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఏం చేయనుందో అనే అంశంపైనా ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది.10వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 43 శాతం ఇచ్చింది. ప్రస్తుత PRC ఈ విషయంలో ఫిట్మెంట్ ఎంత ఇస్తారు అనేది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top