PRC అంశంపై సజ్జల గారు ఫోన్ చేశారు:APGEA
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ సూర్యనారాయణ మాట్లాడుతూ... ఇప్పుడే ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారి నుండి నాకు కాల్ వచ్చింది.ముఖ్యమంత్రి గారి వద్ద PRC అంశంపై అధికారుల సమావేశం జరిగింది. కార్యదర్శుల కమిటీ నివేదిక ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సిఎం కి ఇస్తారు.
అదే నివేదిక సాయంత్రం 6 గంటలకు సంఘాలకు CS గారు ఇస్తారు. రేపు సిఎం గారి వద్ద సంఘాల నాయకులతో సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమాచారం నిమిత్తం తెలియచేస్తున్నాను అని అన్నారు.
సీఎం జగన్ కి పీఆర్సీ పై నివేదిక ఇచ్చిన అధికారులు
తాడేపల్లి - సీఎం వైఎస్ జగన్ ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ
సీఎస్ తోపాటు సీఎంను కలిసిన పీఆర్సీ కమిటీ సభ్యులు శశిభూషన్ కుమార్, రావత్
సీఎం జగన్ కి పీఆర్సీ పై నివేదిక ఇచ్చిన అధికారులు
6 గంటలకు సచివాలయంలో సీఎస్ ప్రెస్ మీట్
ఉద్యోగులకు ఫిట్ మెంట్ ను సీఎస్ సమీర్ శర్మ ప్రకటించే అవకాశం
0 comments:
Post a Comment