*ఫిబ్రవరి 28, 2022 వరకు అవకాశం
దిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఇ-వెరిఫై చేయని వారికి ఐటీ విభాగం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 28, 2022లోపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరింది. ఆదాయపు పన్ను (ఐటీ) నిబంధనల ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఐటీఆర్ దాఖలు చేసినవారు 120 రోజుల్లోగా దాన్ని ఇ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. లేదా 'సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) కు ఫైల్ చేసిన ఐటీఆర్ పత్రాలను బెంగళూరులోని ఐటీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా డీమ్యాట్ ఖాతా, బ్యాంకు ఖాతాలో ఏదేని ఒకదానికి పంపిన కోడ్ ద్వారా ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అలా చేయలేకపోయిన వారికోసం తాజాగా ఐటీ విభాగం మరో అవకాశం కల్పించింది.
ఐటీఆర్- ఫారం ద్వారా ఈ ఇ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఐటీఆర్ను దాఖలు చేయనట్లుగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ఇతర కారణాల ద్వారా ఇప్పటికే తిరస్కరణకు గురైన ఐటీఆర్లను తాజా ఇ వెరిఫికేషన్లో అనుమతించబోమని తెలిపింది. వారికి ఈ గడవు వర్తించబోదని పేర్కొంది.
0 comments:
Post a Comment