Google Pay జనవరి 1 నుండి కొత్త రూల్స్
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లెల్లో సైతం స్కానర్లు సందడి చేస్తున్నాయి.చేతిలో పది పైసలు లేకున్నా సెల్ ఫోన్ తో ఫుల్ షాపింగ్ చేస్తున్నాం. మొదట్లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ను పెంచడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వచ్చేవి. ఆన్ లైన్ సేవలు విపరీతంగా పెరిగే సరికి ఆయా కంపెనీలు మరింత మంది యూజర్లను పెంచుకునే పనిలో పడ్డారు. గూగూల్ పే కూడా అదే తోవలో నడిచింది.
అయితే ఇప్పుడు కొత్త కష్టమర్ల సంగతి ఏమో గానీ ఉన్నోళ్లుకు కొత్త తిప్పలు వచ్చేలా కనిపిస్తున్నాయి. నూతన సంవత్సరం నుంచి గూగూల్ పే కొత్త రూల్స్ తీసుకు రానుంది. అంటే మన కేంద్ర బ్యాంకు ఆర్బీఐ రూల్స్ ను తూ.చా తప్పకుండా ఫాలో అయ్యేందుకు సిద్దం అయింది. దీని ప్రకారం కార్డు జారీ చేసిన సంస్థలు, కార్డు నెట్ వర్క్ సంస్థలు తప్పా, ఇక ఏ ఇతర సంస్థలు కూడా కస్టమర్ల కార్డుల వివరాలు తమ దగ్గర ఉంచుకోరాదు. అలాగే ఇంతకు ముందు ఇలా కస్టమర్ల సమాచారం తీసుకుని ఉంటే వాటిని వెంటనే తీసేయాలి.
కార్డు నెంబర్, ఎక్స్ పైరీ తేది(డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్) లాంటి సమాచారం గూగూల్ తన దగ్గర దాచుకోదు. అలాగే గూగూల్ పే అలాంటి సమాచారం అడిగినట్టు మీకు కనిపిస్తే అది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనే అని గుర్తించాలి. కొత్త రూల్స్ వలన మంత్లీ రికరింగ్ పేమెంట్స్ క్యా్న్సిల్ కావొచ్చు. అందువల్ల గూగుల్ పే వాడే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మళ్లీ కార్డు వివరాలను ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్లు నిర్వహించాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment