తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను వివరించారని తెలిపారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశముందన్నారు. ముఖ్యమంత్రితో రేపు సమావేశం ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్ సీఎంకు వివరిస్తామని వెంకట్రామిరెడ్డి అన్నారు.
నివేదిక ఆమోదయోగ్యంగా లేదు: ఐకాస నేత బండి శ్రీనివాస్
‘‘సీఎస్ కమిటీ నివేదిక మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పాం. నిన్న ఇచ్చిన నివేదికతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నివేదికపై మా అభిప్రాయాలను సజ్జలకు వివరించాం. సీఎస్ కమిటీ నివేదికపై ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. సీఎం న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఐఏఎస్‌లు ఇచ్చిన నివేదికను పరిగణించవద్దని సీఎంను కోరుతున్నాం. 2018 జులై నుంచి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరాం’’ అని పేర్కొన్నారు.
ఆశించినట్లు సిఫార్సులు లేవు: వెంకట్రామిరెడ్డి
‘‘ఉద్యోగులు ఆశించినట్లు కమిటీ సిఫార్సులు లేవు. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు’’ అని తెలిపారు.
0 comments:
Post a Comment