తాత్కాలికంగా ఉద్యమం వాయిదా: జేఏసీ నేతలు
ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలతో ముగిసిన చర్చలు...
ఉద్యమాన్ని విరమించాలని జేఏసీ నేతలకు సూచించిన ప్రభుత్వం...తాత్కాలికంగాఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ నేతలు.
తమ డిమాండ్లపై రాత పూర్వక హామీ ఇవ్వాలని కోరిన జేఏసీల ప్రతినిధులు...
రాతపూర్వక హామీ ఇస్తే ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తామన్న బండి, బొప్పరాజు...
ఉద్యోగుల డిమాండ్లపై వచ్చే బుధవారం అన్ని విభాగాల కార్యదర్శులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చిన ఆర్ధిక మంత్రి బుగ్గన...
9 సంఘాలతో కూడిన జేఏసీ ఐక్య వేదిక ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు
కామ్రేడ్స్!
ఈ రోజు జేఏసీలు ఇచ్చిన 70 డిమాండ్లపై (PRC మినహా) ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, GAD సెక్రెటరీ శశి భూషణ్ కుమార్ లతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 9 సంఘాలతో కూడిన జేఏసీ ఐక్య వేదిక ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు జరిగాయి.
జేఏసీ ఐక్య వేదిక ఇచ్చిన 70 డిమాండ్లపై బుధవారం (23.12.2021) ఆ యా శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం పెడతారు.
ప్రతీ ఒక్క సమస్య పరిష్కారం ఏ దిశలో ఉంది, ఎంతకాలంలో పరిష్కరిస్తారు అనేది చర్చించి, నిర్దిష్ట కాల పరిమితితో సమస్యలు పరిష్కార మయ్యేలా వ్రాత పూర్వకంగా ఇస్తామన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా మీడియా ముందు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తానని హామీ ఇచ్చారు. PRC అంశంపై రేపు లేదా సోమవారం ముఖ్య మంత్రి సమక్షంలో చర్చలు ఉంటాయి కాబట్టి పోరాటం విరమించాలని కోరారు.
అయితే, మంత్రి కోరిక మేరకు PRC పై చర్చలు దగ్గరలోనే ఉన్న నేపథ్యంలో పోరాటం తాత్కాలికంగా వాయిదా వేయాలని ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.
ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని.. కొవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యం అయిందన్నారు. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. దశల వారీగా వారిచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం సీఎస్ సమీర్‌శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందని.. తానే స్వయంగా పర్యవేక్షిస్తాని బుగ్గన తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమం చేస్తున్నాయని, వారిని విరమించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నట్లు తెలిపారు. డిమాండ్లను పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేర్వేరుగా చర్చలు జరిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్‌సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై భేటీలో ప్రధానంగా చర్చించారు.
0 comments:
Post a Comment