ఏ పార్టీకీ తొత్తులం కాదు
» ఇప్పటికీ పీఆర్సీ రిపోర్టు ఇవ్వలేదు
» సీఎం దర్శనమూ లభించలేదు.
» అందుకే ఉద్యమ కార్యాచరణ: జేఏసీ చైర్మన్ బండి
"మేం ఏ రాజకీయ పార్టీకీ తొత్తులం కాదు. ఉద్యోగ, ఉపా ద్యాయ, కార్మిక, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పెన్షనర్ల కోసమే ఉద్యమిస్తున్నాం" అని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, జేఏసీ అమరావతి అసోసియేట్ అధ్యక్షుడు ఫణి పేర్రాజు స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ నివేదిక అడిగినా ప్రభుత్వం ఇవ్వకపోవడం తమను అవమానించడమేనన్నారు. న్యాయ మైన 71 డిమాండ్లను పరిష్కరించాలని కోరినా పట్టించుకో లేదన్నారు. సీపీఎస్ రద్దు చేయలేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయలేదన్నారు. ఉద్యోగుల సరెండర్ లీవ్, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, ఏపీజీ ఎస్ఐ చెల్లింపులు నిలిచిపోవడం దారుణమన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు కొన్ని వ్యాఖ్యలు చేస్తే, అనని మాటలను పీకి అనుకూలంగా ఉన్నట్టు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి మంగళవారం నుంచి ఉద్యమిస్తున్నట్టు తెలిపారు. మాట తప్ప.. మడమ తిప్పం అంటూ సీఎం జగన్ చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లిన దృష్ట్యా తమ సమ స్యల విషయంలో కూడా అదే విధంగా పరిష్కార మార్గం చూపాలని బండి శ్రీనివాసరావు, పేర్రాజులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను చెప్పుకొందామంటే ముఖ్యమంత్రి జగన్ దర్శన భాగ్యం కలగడం లేదని బండి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమానికి ప్రభుత్వమే కారణమని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చాకే ఈ ఉద్యమానికి దిగుతున్నట్టు చెప్పారు.
0 comments:
Post a Comment