ఉద్యోగుల అంశాలు అన్ని త్వరలోనే పరిష్కారమవుతాయి: సజ్జల
ఉద్యోగుల ఆందోళనపై స్పందిస్తూ, ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ఆలోచనలు కింది స్థాయికి తీసుకెళ్లాల్సిన వారిపై ప్రేమే ఉంటుందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ, చంద్రబాబు డీఎలు ఎగ్గొడితే మేము రాగానే ఐఆర్ ఇచ్చాం. కోవిడ్ వల్ల ఇబ్బంది వచ్చిన మాట వా స్తవమే. కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నలుగురే ఉద్యోగులు కాదు కదా. ఒక వేళ వాళ్ళు నిర్ణాయక శక్తి అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్లొచ్చుకదా అని ప్రశ్నించారు. రాజకీయంగా అధికారంలోకి వచ్చే వారు ఐదేళ్లు గెస్ట్ లా ఉంటారు.. ఉద్యోగులు వ్యవస్థలో ఓ భాగం.. ముఖ్యమంత్రి , ప్రభుత్వ ఆలోచనలను కింది స్థాయిలోకి తీసుకెళ్లి అమలు చేస్తున్నారు.. వారికి పూర్తి స్థాయిలో పనిచేసే వాతావరణం కల్పించాలనే ప్రభుత్వ ఆలోచన. పీఆర్సీని త్వరలోనే పరిష్కారమవుతుందని చెప్పారు. అయితే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాలను కూల్చేస్తామనే వ్యాఖ్యలకు విలువ ఉండదన్నారు. అలాగైతే ఎన్నికల సమయంలో ఉద్యోగులను సంతృప్తిపరచి ప్రభుత్వాలను నడుపుకోవచ్చు.. ప్రజల్లో భాగమైన ఉద్యోగులు అంటే ఆ నలుగురు నేతలు మాత్రమేకాదు.. కిందిస్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా దీన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల . అంశాలు అన్ని త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు
0 comments:
Post a Comment