ఉద్యోగులకు చెందిన 70 డిమాండ్ల మీద ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఈ నెల 13, 16, 21 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. విజయవాడలో బుధవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ, ఏపీ ఏజేసీ అమరావతి ఐక్య వేదిక, నగర ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన నిధులను దారి మళ్లించారని, సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటే, ఆ బిల్లులూ చెల్లించకుండా రూ.23 కోట్లు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి మాట్లాడుతూ రుణాలకు సంబంధించి సుమారు రూ.1600కోట్లు ఉన్నాయని, అవి ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment